Ambulance | అంబులెన్స్ (Ambulance).. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రికి చేరవేడయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఘటనాస్థలికి క్షణాల్లో చేరుకుని బాధితుల ప్రాణాలు కాపాడుతుంది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఈ వాహనాన్ని ఓ డ్రైవర్ (Driver)తన సొంత అవసరాలకు వాడుకున్నాడు.
రాజస్థాన్ (Rajasthan)లోని దౌసా (Dausa) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్.. చెప్పులు (footwear), బూట్ల (Shoes)ను జైపూర్ (Jaipur) నుంచి దౌసా (Dausa)కు అత్యవసర వాహనం (Emergency Vehicle)లో ట్రాన్స్పోర్ట్ (Transport)చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు సదరు డ్రైవర్‌పై చర్యలకు ఉపక్రమించారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటనపై దౌసా ప్రభుత్వ ఆసుపత్రి (Dausa Government Hospital) ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ (principal medical officer) డాక్టర్ శివరామ్ మీనా (Shivram Meena) స్పందించారు.
‘అంబులెన్స్ డ్రైవర్‌ను ఓ ఎన్జీవో (NGO) నియమించింది. అతడిని విధుల నుంచి తొలగించాం. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని శివరామ్ మీనా తెలిపారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని.. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
Also Read..
Google | గూగుల్ కీలక నిర్ణయం.. డెస్క్ షేర్ చేసుకోవాలంటూ ఉద్యోగులకు ఆదేశం..!
Akshay Kumar | షాకింగ్ నిర్ణయం.. ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్న స్టార్ నటుడు..!
IAS Vs IPS | రోహిణి సింధూరికి భారీ ఊరట.. అసత్య వ్యాఖ్యలు చేయొద్దంటూ రూపకు కోర్టు ఆదేశాలు..!
RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!
Thiruvananthapuram | తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధింపు