Akshay Kumar | షాకింగ్ నిర్ణయం.. ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్న స్టార్ నటుడు..!
Akshay Kumar | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అక్షయ్ కుమార్ భారత్‌తోపాటు కెనడా పౌరసత్వం (Canadian citizenship) కూడా కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే... కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు ఆయన షాకింగ్ విషయం చెప్పారు.
Akshay Kumar | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే, అక్షయ్.. భారత్‌తోపాటు కెనడా పౌరసత్వం (Canadian citizenship) కూడా కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయమై గత కొన్ని రోజులుగా నటుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా అక్షయ్ స్పందించారు. తాను భారతీయుడినని.. తనకు సర్వం భారత దేశమేనని స్పష్టం చేశారు. కెనడా పౌరసత్వం (Canadian citizenship) తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
‘ఇండియానే నాకు సర్వస్వం. నేను ఏం సంపాదించినా.. సాధించినా అన్నీ ఇక్కడి నుంచే. ఇప్పుడు మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాను. కానీ ఏం తెలియకుండా కొందరు మాట్లాడే మాటలు చాలా బాధిస్తాయి’ అని అన్నారు. ఈ సందర్భంగా తాను కెనడా పౌరసత్వాన్ని (Canadian citizenship) వదులుకుంటున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు.
కెనడా పౌరసత్వం తీసుకోడానికి కారణం గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘నాకు హిందీలో సినిమాలు వర్కౌట్ కావట్లేదు. వేరే ఇంకేదైన పని చేసుకోవాలి అనిపించింది. నా ఫ్రెండ్ ఒకరు కెనడాలో ఉన్నారు. నాగురించి తెలిసి నన్ను అక్కడకి రమ్మన్నారు. అంతే.. అక్కడికి వెళ్లాను. పౌరసత్వానికి అప్లై చేసుకున్నాను. ఆ సమయంలో రెండు సినిమాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అదృష్టం కొద్దీ విడుదలైన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరికొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో నా ఫ్రెండ్ ‘వెళ్లు మళ్లీ నీ పని మొదలు పెట్టు’ అని సలహా ఇచ్చాడు. దీంతో నేను మళ్లీ తిరిగి ఇండియా వచ్చాను. ఇప్పుడు నా కెనడా పాస్‌పోర్ట్‌ను కూడా మార్చుకోడానికి దరఖాస్తు చేసుకున్నా’ అని అక్షయ్ కుమార్ వివరించారు.
Also Read..
Mahesh babu | త్రివిక్రమ్, మహేశ్‌బాబు మూవీ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
Janhvi Kapoor | టాలీవుడ్ ఎంట్రీ కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు అడుగుతుందా?
Pathaan Collections | బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ ప్రభంజనం.. 1000 కోట్ల క్లబ్లో పఠాన్
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్‌చరణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

