Google | ఆర్థిక మాంద్యం భయాందోళనల నడుమ ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ (Google) ఇటీవల తమ సంస్థలో భారీగా ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న గూగుల్ కార్యాలయాల్లో అనవసరమని భావిస్తున్న కొన్నింటిని ఖాళీ చేస్తున్నట్లు గూగుల్ వర్గాలు తెలిపాయి. అందులోని ఉద్యోగుల్ని మరోచోట సర్దుబాటు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగులు తమ డెస్క్‌లను షేర్ (Desk Sharing) చేసుకోవాలని ఆదేశించింది.
గూగుల్ (Google) తాజా నిర్ణయంతో ఒకే డెస్క్‌ను ఇద్దరు ఉద్యోగులు వాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ డెస్క్ షేరింగ్ (Desk Sharing) విధానం కిర్క్లాండ్ (Kirkland), వాషింగ్టన్ (Washington), న్యూయార్క్ (New York City), శాన్ఫ్రాన్సిస్కో ( San Francisco), సియాటెల్ (Seattle), సన్నీవేల్ (Sunnyvale), కాలిఫోర్నియా (California)లో ఉన్న కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ఈ మేరకు డెస్క్ షేర్ (Desk Share) చేసుకోవాలంటూ ఆయా నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ( Google employees) కంపెనీ అంతర్గత మెమో జారీ చేసినట్లు సీఎన్‌బీసీ (CNBC) ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ఆయా ఉద్యోగులను పరస్పర అంగీకారంతో రోజు విడిచి రోజు ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నట్లు పేర్కొంది.
Also Read…
Akshay Kumar | షాకింగ్ నిర్ణయం.. దేశ పౌరసత్వాన్ని వదులుకున్న స్టార్ నటుడు..!
Congress | నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం..!
IAS Vs IPS | రోహిణి సింధూరికి భారీ ఊరట.. అసత్య వ్యాఖ్యలు చేయొద్దంటూ రూపకు కోర్టు ఆదేశాలు..!
Farmers | 3 నెలల్లోనే 3 రెట్ల ఆదాయం.. ఈ పంటలతో లాభాలు గడిస్తున్న మాక్లూర్ రైతన్నలు