IAS Vs IPS | కర్ణాటక (Karnataka)లో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య సోషల్ మీడియా వేదికగా చోటుచేసుకున్న వార్ కొనసాగుతోంది. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ (IPS) అధికారిణి డీ రూప (D Roopa Moudgil) , దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ (IAS) అధికారిణి రోహిణి సింధూరి (Rohini Sinduri) ఒకరినొకరు దూషించుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా వీరి వివాదం చివరకి కోర్టుకు చేరింది.
తనపై అసత్య వ్యాఖ్యలు చేయకుండా రూపను నిరోధించాలని కోరుతూ ఐఏఎస్ (IAS) అధికారిణి రోహణి సింధూరి (Rohini Sinduri) కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు 74వ సిటీ సివిల్ న్యాయస్థానం.. ఐఏఎస్ రోహిణికి పరువు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని ఐపీఎస్ (IPS) అధికారిణి డీ రూప (D Roopa Moudgil)ను ఆదేశించింది.
రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధారరహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని ప్రచార మాధ్యమాలను న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రూపకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
రూప చేసిన ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న రోహిణి.. తనపై చేసిన వ్యాఖ్యలకు గానూ నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని రూపకు నోటీసులు పంపింది. నష్ట పరిహారంతోపాటుగా తనకు క్షమాపణలుకు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. తన ప్రతిష్టకు జరిగిన నష్టం, మానసిక వేదనకు గానూ ఈ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని రోహిణి హెచ్చరించింది.
Read Also..
IAS Vs IPS | నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలి, క్షమాపణలు చెప్పాలి.. రూపకు రోహిణి నోటీసులు..!
IAS vs IPS | ఆ ఇద్దరు మహిళా ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం..!