Thiruvananthapuram | కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురం ( Thiruvananthapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో ఫుల్ ఎమర్జెన్సీ (Full Emergency) విధించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ (Calicut) నుంచి సౌదీ అరేబియా(Saudi Arabia)లోని దమ్మాన్ (Damman ) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం (hydraulic failure) తలెత్తినట్లు సమాచారం.
ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 182 మంది ప్రయాణికులతో
కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేను ఢీ కొట్టింది. దీంతో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే విమానాన్ని తిరువనంతపురంకు మళ్లించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. తర్వాత మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణంతోనే తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు.
కేరళ (Kerala) రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలో (Saudi Arabia)ని దమ్మాన్ (Damman )కు 182 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Air India Express) శుక్రవారం బయలు దేరింది. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు (technical issues) తలెత్తడంతో ఫ్లైట్‌ను తిరువనంతపురం (Thiruvananthapuram) వైపు దారి మళ్లించారు.
‘168 మంది ప్రయాణికులతో కాలికట్ (Calicut) నుంచి సౌదీ అరేబియా (Saudi Arabia) లోని దమ్మాన్ (Damman ) వెల్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం సాంకేతిక సమస్యల (technical issues)కారణంగా తిరువనంతపురం (Thiruvananthapuram) వైపు దారి మళ్లించబడింది’ అని ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also..
Google | గూగుల్ కీలక నిర్ణయం.. డెస్క్ షేర్ చేసుకోవాలంటూ ఉద్యోగులకు ఆదేశం..!
Congress | నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం..!
IAS Vs IPS | రోహిణి సింధూరికి భారీ ఊరట.. అసత్య వ్యాఖ్యలు చేయొద్దంటూ రూపకు కోర్టు ఆదేశాలు..!
Hindenburg | డ్రైవర్ల ఉపాధి కాపాడిన హిండెన్‌బర్గ్ నివేదిక!