Hindenburg | దార్లఘాట్: తమ జీవనోపాధి కాపాడటానికి దేవుడే హిండెన్‌బర్గ్ నివేదికను పంపించాడని ఆ ట్రక్ డ్రైవర్లు చెప్పారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని గగల్, దార్లఘాట్లో ఉన్న గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ నుం చి సిమెంట్‌ను రవాణా చేస్తుంటారు. రవాణా చార్జీల చెల్లింపు వివాదం కారణంగా అదానీ గత డిసెంబర్లో ఫ్యాక్టరీని మూసేశారు. 7 వేల మంది ట్రక్ డ్రైవర్లు, యజమానుల ఉపాధి దెబ్బతింది. గత సోమవారం అదానీ గ్రూప్ రవాణా చార్జీలను 10-12 శాతం తగ్గించి సమస్యను పరిష్కరించుకుందామని ట్రక్ డ్రైవర్లను కోరింది.
ఈ చర్చలు ఫలప్రదం కావడం ట్రక్ డ్రైవ ర్లు తమ విజయంగా భావిస్తున్నారు. అదానీ గ్రూప్ షేర్ల అవకతవ కలపై హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన నెల తర్వాత ట్రక్ డ్రైవర్ల సమస్య పరిష్కార మైంది. ‘భారత్‌లోని అతి పెద్ద వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా మేం చేసిన పోరాటంలో ఆ నివేదిక కీలక పాత్ర పోషించింది. డ్రైవర్లను చైతన్య పరచడానికి, రాజకీయ మద్దతు కూడగట్టడానికి సహాయ పడింది’ అని పోరాటానికి నాయ కత్వం వహించిన రామ్ కృష్ణన్ శర్మ తెలిపారు.