బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే తెలిపారు. రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ (Shivakumar) సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం రామనగరంలో మీడియతో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు గురించి వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండు, మూడు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇక్కడి పరిస్థితి గురించి తెలుసని, ఆయనకు అవకాశం ఇవ్వడానికి సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయిన డీకే శివకుమార్ శ్రమ, కార్యాచరణ, వ్యూహాలు కారణమన్నది అందరికీ తెలుసని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ గుర్తు చేశారు. శివకుమార్ సీఎం అవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. ‘అవును, నేను చెబుతున్నా. విప్లవాత్మక రాజకీయ పరిణామాల కోసం కొంతమంది నాయకులు సూచిస్తున్న తేదీ సెప్టెంబర్ తర్వాత జరుగుతుంది. వారు మాట్లాడుతున్నది ఇదే. రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారు. డొంక తిరుగుడు కాకుండా నేను నేరుగా చెబుతున్నా’ అని అన్నారు.
Also Read:
Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్.. తర్వాత ఏం జరిగిందంటే?