Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ (India) చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హసీనా ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం మేరకు మరికొన్ని రోజులు ఆమె భారత్‌లోనే ఉండనున్నట్లు (Hasina To Stay In India) తెలిసింది. భారత ప్రభుత్వం కూడా అందుకు అనుమతిచ్చినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నిన్న సాయంత్రం బంగ్లా నుంచి ఢిల్లీ చేరుకున్న హసీనా ఇక్కడి నుంచి భారత్ సహకారంతో లండన్ (London) వెళ్లాలని యోచించారు. హసీనా రాజకీయ శరణార్థిగా యూకే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆశ్రయం కోసం అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకూ ఆమె ఢిల్లీలో ఉండేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Also Read..
All Party Meeting | బంగ్లాదేశ్ సంక్షోభం.. ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 20 గేట్లు ఎత్తివేత