All Party Meeting | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ (India) చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హసీనా తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) వివరిస్తున్నారు.
#WATCH | Delhi: All-party meeting underway in the Parliament on the issue of Bangladesh. EAM Dr S Jaishankar briefs the members of different political parties. pic.twitter.com/4Cl1rFRkyG
— ANI (@ANI) August 6, 2024
Leader of Opposition in both Houses, Rahul Gandhi (Lok Sabha) and Mallikarjun Kharge (Rajya Sabha) to attend the all-party meeting on the Bangladesh issue.
— ANI (@ANI) August 6, 2024
Also Read..
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 20 గేట్లు ఎత్తివేత
Mushrooms | మ్యాజిక్ మష్రూమ్‌లతో మానసిక అస్వస్థతలకు చికిత్స!
Paris Olympics | ఒలింపిక్ విలేజ్‌లో వసతుల కొరత.. పార్క్‌లో నేలమీద పడుకుని ఇటలీ స్విమ్మర్ నిరసన