Mushrooms | న్యూఢిల్లీ : వివిధ రకాల మానసిక అస్వస్థతలకు చికిత్స కోసం మ్యాజిక్ పుట్ట గొడుగుల్లోని(మష్రూమ్) సిలోసిబిన్ ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేస్తున్నది. సెయింట్ లూయీస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ‘నేచర్’ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి 18 ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్ తీశారు.
వేర్వేరు బ్రెయిన్ నెట్‌వర్క్‌ల మధ్య కమ్యూనికేషన్ పెరిగినప్పటికీ, అప్పటికే ఏర్పాటైన నెట్‌వర్క్‌లలో మెదడులోని వేర్వేరు భాగాల మధ్య అనుసంధానం దెబ్బ తిన్నట్లు కనిపించింది. దీనిని బట్టి మెదడు ద్వారా సమాచారం ప్రాసెస్ అవడాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యాన్ని సిలోసిబిన్ తగ్గిస్తుందని, క్రమరహిత స్థితిని సృష్టిస్తుందని తెలుస్తున్నది. అయితే ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో దీర్ఘకాలంలో మెరుగుదల కనిపించలేదు.