Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 22 గేట్ల ద్వారా దిగువకు నీరు.. వీడియో
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అతే మొత్తం కిందికి వెళ్తున్నది.
నల్లగొండ: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అతే మొత్తం కిందికి వెళ్తున్నది. క్రెస్ట్ గేట్ల ద్వారా 2,55,296 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7601 క్యూసెక్కులు, కుడి కాలువకు 7878, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్కులు, ఏఎమ్మార్ ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్ట నీటినిల్వ 312.50 టీఎంసీలు. ఇప్పుడు 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్ నుంచి భారీగా వరద దిగువకు వెళ్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ఇప్పుడు 142.71 అడుగులుగా ఉన్నది. 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 10.65 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 74,443 క్యూసెక్కుల వరద వస్తుండగా, 25,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

