హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారబోసారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యక్తికి సార్ చేసిన కృషి అనిర్వచనీయమని చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమని, స్ఫూర్తి మరచిపోలేనిదని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అని కీర్తించారు. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగిందని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కొనసాగుతున్నదని చెప్పారు.
‘‘పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది.. వారి స్ఫూర్తి మరిచిపోలేనిది. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం. జోహార్ జయశంకర్ సార్! జై తెలంగాణ’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక… pic.twitter.com/6TTW4FXysS
— KTR (@KTRBRS) August 6, 2024