e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Drugs Case : ఆర్యన్‌ ఖాన్‌ తర్వాత.. ఇప్పుడు ‘స్టార్‌ కిడ్స్‌’పై ఎన్సీబీ కన్ను

Drugs Case : ఆర్యన్‌ ఖాన్‌ తర్వాత.. ఇప్పుడు ‘స్టార్‌ కిడ్స్‌’పై ఎన్సీబీ కన్ను

(Drugs Case) ముంబై : ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత ఇప్పుడు క్రమంగా అతడితో టచ్‌లో ఉన్న చాలా మంది స్టార్ పిల్లలపైకి తన రాడార్‌ను మత్తు మందుల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) తిప్పింది. ఆర్యన్‌ఖాన్‌తో కలిసి డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు పలువురు నటీనటుల పిల్లలను ఎన్‌సీబీ అనుమానిస్తున్నది. ఈ కేసులో ఓ నిర్మాత కుమార్తె, నటి సోదరి, నటుడి కుమార్తె, ఓ నటుడి మేనల్లుడికి సమన్లు పంపే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

గురువారం నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండేను ఎన్‌సీబీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. ఎన్‌సీబీకి దగ్గరి వ్యక్తుల సమాచారం మేరకు, ఆర్యన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న పలువురు స్టార్‌ కిడ్స్‌పై ఎన్‌సీబీ కన్నేసింది. వీరంతా ఆర్యన్‌తో చాట్‌లో పాల్గొన్నట్లు ఎన్‌సీబీ గుర్తించినట్లు తెలుస్తున్నది. త్వరలో వీరందరికీ సమన్లు పంపి విచారణకు రావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

- Advertisement -

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టైన తర్వాత చాలా మంది బాలీవుడ్ స్టార్ పిల్లలు ఇండియా విడిచి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు. ‘నాకున్న ఆధారాల ప్రకారం చాలా మంది ప్రముఖుల పిల్లలు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ తర్వాత భారతదేశాన్ని విడిచి వెళ్లాలని యోచిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌కే ఇలా జరిగితే ఎవరికైనా జరుగొచ్చని వారు భావిస్తున్నారు’ అని కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్విట్టర్‌ రాశారు.

ఇలాఉండగా, స్టార్‌ కిడ్స్‌ లక్ష్యంగా చేసుకుని సీనియర్‌ నటి కంగనా రనౌత్‌ పలు వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనంతరం డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుడు శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌లపై కంగనా రనౌత్‌ పలు ఆరోపణలు చేశారు. స్టార్‌ కిడ్స్‌ తమ మేనేజర్లను ‘మాల్‌ హై క్యా’ అని అడుగుతారని ట్విట్టర్‌లో కంగానా రాసింది. కంగనా ఆరోపణలు చేసిన నలుగురు నటీమణులను ఎన్‌సీబీ గతంలోనే ప్రశ్నించింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్‌ రాయల్‌ మింట్‌ చొరవ

ఈ చెక్క కత్తి .. స్టీల్‌ కత్తి కంటే వెరీ షార్ప్‌ గురూ!

డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరిన సింధు

పట్టాభికి 14 రోజుల రిమాండ్‌, మచిలీపట్నం జైలుకు తరలింపు

మళ్లీ మొదలైన శ్రీశైలం గిరిప్రదక్షిణం

బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి

నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం

దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్‌

అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్‌

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement