Devaragattu : దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
Devaragattu : దేవరగట్టులో ప్రతి ఏటా సంప్రదాయకంగా నిర్వహిస్తున్న కర్రల సమరం ఉద్దేశపూర్వక దాడిగా మారుతున్నది. దసారా రోజున దేవరగట్టులో కర్రలతో కొట్టుకోవడం ..

(Devaragattu) కర్నూలు: దేవరగట్టులో ప్రతి ఏటా సంప్రదాయకంగా నిర్వహిస్తున్న కర్రల సమరం ఉద్దేశపూర్వక దాడిగా మారుతున్నది. దసారా రోజున దేవరగట్టులో కర్రలతో కొట్టుకోవడం ఎప్పటినుంచే కొనసాగుతున్నది. అయితే, గతంలో సంప్రదాయకంగా కొనసాగిన కర్రల సమరం.. ఇప్పుడు ఉద్దేశపూర్వక దాడిగా మారడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతుండటంతో విస్మయానికి గురవుతున్నారు. దసరా రోజున జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా కర్రలతో దాడి చేసినట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోల ఆధారంగా కర్రల సమరం కాకుండా ఉద్దేశపూర్వక దాడి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్రల సమరంలో పాల్గొన్న ఎల్లార్తి గ్రామానికి చెందిన 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దసరా పండగ రోజున కర్రలతో కొట్టుకోవడం దేవరగట్టులో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే, సంప్రదాయం కాస్తా పనిగట్టుకుని చేసే దాడిలా మారినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. పాత పగలతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇలాంటి ఘటనలు ఇంతవరకు జరగలేదని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి దురుద్దేశపూర్వక దాడులకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
కాపు కాసి.. దాడి చేసి..
దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు లక్షలాది మంది కర్రలతో పోటీపడటం ఇక్కడ ఆనవాయితీ. ఇలాంటివి మానుకోవాలని పోలీసులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈసారైనా అడ్డుకోవాలని వచ్చిన వేల మంది పోలీసులు.. మళ్లీ ప్రేక్షకుల్లానే మారిపోయారనే అపవాదు ఉన్నది. రెండు వేల మంది పోలీసులు, నిఘా కెమెరాలు, డ్రోన్లు, బారికేడ్లు, చెక్‌పోస్టులు దేవరగట్టు సమరాన్ని నిలువరించలేకపోవడం విశేషం. దాదాపు 12 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు. ఇదే అదనుగా ప్రతీకారం తీర్చుకునేందుకు కాపుకాసిన ఓ బృందం.. తమ శత్రువల తలల నుంచి రక్తం కారేలా కొట్టింది. కావాలని కొడుతున్న తీరును గుర్తించిన కొందరు బాధితులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాలు బయటపడ్డాయి.
ఇవి కూడా చదవండి..
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

