Bill Gates : ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
Bill Gates : సాఫ్ట్వేర్ రంగంలో చిరపరిచితుడైన బిల్‌గేట్స్ ఎంతటి రసికుడో.. ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి...

(Bill Gates) వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థ. దీని వ్యవస్థాపక చైర్మన్ బిల్‌గేట్స్ అంటే చాలా మందికి ఎనలేని గౌరవం. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎందరో సాఫ్ట్వేర్ వ్యాపారంలోకి వచ్చారు. సాఫ్ట్వేర్ రంగంలో చిరపరిచితుడైన బిల్‌గేట్స్ ఎంతటి రసికుడో.. ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మే 3 వ తేదీ రాత్రి ట్విట్టర్ ద్వారా బిల్ గేట్స్ ప్రకటించారు. వీరికి 2021 ఆగస్టులో విడాకులు మంజూరయ్యాయి.
నిజానికి 2019 లోనే విడాకుల కోసం న్యాయవాదిని మిలిండా గేట్స్ సంప్రదించారనే విషయం బయటకు వచ్చింది. లైంగిక నేరాల్లో దోషిగా తేలి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్‌గేట్స్ సాన్నిహిత్యమే విడాకులకు కారణమని ప్రచారం జరుగుతోంది. సంఘ సేవలో బిజీగా ఉండే మిలిండా.. గత రెండు దశాబ్దాల కాలంలో బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది.
అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించిన బిల్‌గేట్స్.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్నప్పుడు 1987లో మెలిండా ప్రొడక్ట్ మేనేజరుగా చేరారు. అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ ఆమెనే కావడం విశేషం. ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.
మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్లయిన తర్వాత కూడా బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలు కొనసాగించారు. బయట కలుసుకుందాం అంటూ మహిళా ఉద్యోగులకు మెయిల్స్ పంపేవాడు. తనతో డేటింగ్‌కు రావాలని అందమైన ఉద్యోగులను కోరేవాడు. ఈ విషయం బయటకు రావడంతో కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌లు ఆయనను హెచ్చరించారు. ఈ విషయం బోర్డ్ మీటింగ్ చర్చకు కూడా వచ్చింది. ఇక మీదట అలాంటి పనులు చేయనని, బుద్ధిగా ఉంటానని బోర్డుకు చెప్పిన మీదట.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి..
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

