Indonesia : ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
Indonesia : మసీదుల్లో నుంచి వచ్చే ఆజాన్ ధ్వనులను తగ్గించాలని ఇండోనేషియాలోని మసీదు కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఉన్న...

(Indonesia) జకర్తా : మసీదుల్లో నుంచి వచ్చే ఆజాన్ ధ్వనులను తగ్గించాలని ఇండోనేషియాలోని మసీదు కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 70 వేల మసీదుల్లో లౌడ్ స్పీకర్ సౌండ్ తగ్గించనున్నారు. ఆజాన్‌తో నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుందని దేశవ్యాప్తంగా అందిన అనేక మంది ఫిర్యాదుల మేరకు ఇండోనేషియా మసీదు కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించడం స్వచ్ఛందంగా ఉంటుందని మరో కమిటీ పేర్కొనడం విశేషం.
ముస్లిం జనాభా అధికంగా కలిగిన ఇండోనేషియాలో అజాన్ లౌడ్ స్పీకర్ల సౌండ్‌ను తగ్గించారు. పెద్ద శబ్దంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇండోనేషియా మసీదు కౌన్సిల్ ఈ చొరవ తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 70 వేలకుపైగా మసీదులలో చాలా వరకు సౌండ్ సిస్టమ్ ఇబ్బందికరంగా ఉన్నదని ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మసీదు కౌన్సిల్ ప్రెసిడెంట్ యూసుఫ్ కల్లా తెలిపారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ధ్వనిని తగ్గించే పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు 7 వేల మంది సాంకేతిక నిపుణులను నియమించినట్లు ఆయన చెప్పారు. పెద్ద శబ్దంతో ఆజాన్ చేయడం ఇస్లామిక్ సంప్రదాయం అని, ధ్వని చాలా దూరం వరకు చేరాలన్న ఉద్దేశంతోనే పెద్దగా సౌండ్ పెట్టి చదువుతామని కౌన్సిల్ కోఆర్డినేటర్ అజీస్ పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్ల తగ్గింపు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని జకార్తా అల్-ఇక్వాన్ మసీదు చైర్మన్ అహ్మద్ తౌఫిక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

