చరిత్రలో ఈరోజు : భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
Today History : భారతదేశంపై చైనా తొలిసారి 1962 లో సరిగ్గా ఇదే రోజున ప్రణాళికాబద్ధమైన దాడిని ప్రారంభించింది. చైనా సైన్యం సరిహద్దు దాటడమే కాకుండా..

(Today History) భారతదేశంపై చైనా తొలిసారి 1962 లో సరిగ్గా ఇదే రోజున ప్రణాళికాబద్ధమైన దాడిని ప్రారంభించింది. చైనా సైన్యం సరిహద్దు దాటడమే కాకుండా.. స్నేహం పేరుతో ద్రోహానికి పాల్పడింది. తమపై ప్రధాని నెహ్రూ ఉంచిన విశ్వాసాన్ని కాదని దాడికి పాల్పడింది. అప్పుడెప్పుడో 59 ఏండ్ల క్రితం ప్రారంభించిన ఘర్షణను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
భారతదేశం 1947 లో స్వతంత్ర దేశంగా మారగా.. 1949 లో రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మారింది. మొదట్లో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. చైనా కొరకు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వాన్ని భారత్ తిరస్కరించిందనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి నెహ్రూ.. హిందీ-చీనీ.. భాయ్-భాయ్ నినాదాన్ని ఇవ్వడం ద్వారా స్నేహాన్ని పెంపొందించుకున్నారు. 1959 లో దలైలామాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
1962 నాటికి భారత్-చైనాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకున్నది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా భారతదేశంపై దాడి చేసింది. ఈ సమయంలో భారతదేశం యుద్ధానికి సిద్ధంగా లేదు. ఫలితంగా చైనాలోని 80 వేల మంది సైనికులను ఎదుర్కొనేందుకు.. భారతదేశం 10-20 వేల మంది సైనికులను మాత్రమే రంగంలోకి దించింది. యుద్ధం నెల రోజుల పాటు కొనసాగి.. చైనా కాల్పుల విరమణ ప్రకటించే సమయానికి భారతదేశం చాలా నష్టపోయింది. 59 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఘర్షణలు నేటికీ కొనసాగుతుండటం విశేషం.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2011 : లిబియా నియంత గడాఫీ దారుణ హత్య
1995: వెస్టిండీస్‌ను ఓడించి షార్జా ట్రోఫీని గెలుచుకున్న శ్రీలంక
1991: ఉత్తరకాశిలో 6.8 తీవ్రతతో భూకంపం కారణంగా 1000 మందికి పైగా మరణం
1973: తొలిసారిగా ప్రజల కోసం తెరవబడిన ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ఒపెరా హౌస్
1905: చారిత్రాత్మక 11 రోజుల సమ్మె రష్యాలో ప్రారంభం
1880: ఆమ్స్టర్డ్యామ్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపన
1774: భారతదేశ రాజధానిగా మారిన కోల్‌కతా
ఇవి కూడా చదవండి..
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

