Actress molested : విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
Actress molested : విమానం నుంచి దిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ నటిని ఘజియాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు వేధించాడు. ఈ ఘటనలో అతడిని సహార్...

(Actress molested) ముంబై : విమానం నుంచి దిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ నటిని ఘజియాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు వేధించాడు. ఈ ఘటనలో అతడిని సహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు, విమాన సంస్థ అధికారులకు తప్పుడు పేరు చెప్పి బోల్తా కొట్టించాలని చూశాడు. చివరకు వ్యాపారవేత్త ఫొటోను చూసి నటి గుర్తించడంతో.. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన విమానంలో ఓవర్ హెడ్ స్టోరేజ్ నుంచి బ్యాగులు తీసుకుంటున్న ఓ నటిని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేశాడు. అక్టోబర్ 3 న ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించానని ఈ 40 ఏండ్ల నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్ హెడ్ స్టోరేజ్ తెరిచి హ్యాండ్ బ్యాగు తీసుకునేందుకు నటి లేచింది. హ్యాండ్ బ్యాగులను తీస్తున్న సమయంలో ఎవరో తనను తప్పుగా తాకినట్లు గుర్తించింది. దీనిపై అక్కడ ఉన్న వ్యాపారవేత్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న క్యాబిన్ సిబ్బందికి కూడా ఫిర్యాదు చేసింది.
మెయిల్లో ఫిర్యాదు చేయాలని క్యాబిన్ సిబ్బంది నటికి సూచించారు. దాంతో ఆమె తొలుత వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి సహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సహార్ పోలీసులు నితిన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడికి మూడు రోజుల కస్టడీ విధించింది. పోలీసుల విచారణలో తొలుత తన పేరును రాజీవ్ అని చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆయన పేరు నితిన్ అని విమానయాన సంస్థ ధ్రువీకరించింది.
ఇవి కూడా చదవండి..
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

