(Smallest Game console) కాలిఫోర్నియా : పోస్టల్ స్టాంప్ సైజ్‌లో ఉండే గేమ్ కన్సోల్‌ను ఎప్పుడైనా చూశారా? అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి చిన్న గేమ్ కన్సోల్‌ను రూపొందించారు. ఒహియోలోని ఒక కంపెనీ చిన్న సర్క్యూట్స్ ద్వారా దీన్ని అభివృద్ధి చేసింది. దీనిలో ముందుగా ఇన్స్టాల్ చేసిన 5 గేమ్‌లు ఉంటాయి.
ఈ కన్సోల్ తయారు చేసిన కంపెనీ ప్రకారం, ఈ ప్రాథమిక గ్రే మోడల్ ధర రూ.1,425. లింక్ కేబుల్స్, ఇతర ఉపకరణాలతో దీని ధర పెరగవచ్చు. గేమ్ కన్సోల్‌లో ఓఎల్ఈడీ స్క్రీన్ డిస్ప్లే ఉండి, బ్యాటరీతో పాటు కన్సోల్ ఛార్జింగ్ కోసం బజర్, గేమ్ ప్లే బటన్, పవర్ స్విచ్, స్క్రీన్, మైక్రో-యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి. కీ రింగులను కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. టెట్రిస్, స్పేస్ ఇన్వేడర్స్, స్నాక్ వంటి ఆటలను కన్సోల్‌లో ముందే ఇన్స్టాల్ చేశారు. వీటితోపాటు మైక్రోపైథాన్ భాషను ఉపయోగించి వినియోగదారులు సొంతంగా మల్టీప్లేయర్ గేమ్‌లను తయారుచేసుకోవచ్చు.
చిన్న సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల చిన్న వెర్షన్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఒక కంపెనీ ఈ కన్సోల్‌ను అభివృద్ధి చేసింది. ఇలా ఒక పెద్ద వెర్షన్‌ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2012 లో కంపెనీ తన మొట్టమొదటి ఉత్పత్తి స్మాల్ డ్యూనోను తీసుకొచ్చింది. ఇవేకాకుండా టీవీ, ఆర్కేడ్ కన్సోల్, వయోలిన్లను కూడా తయారుచేసింది. ప్రపంచంలోని అతిచిన్న గేమ్ కన్సోల్‌ను తయారుచేయడమే లక్ష్యంగా ఈ గేమ్ కన్సోల్‌ను సిద్ధం చేశానని ఇంజినీర్ బెన్ రోజ్ చెప్పారు.
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..