Dubai @ Kashmir : కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
Dubai @ Kashmir : కశ్మీర్‌కు మొట్టమొదటి విదేశీ పెట్టుబడులు రానున్నాయి. కశ్మీర్ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ సిద్ధంగా ఉన్నది. కశ్మీర్ లోయలో...

(Dubai @ Kashmir) శ్రీనగర్ : కశ్మీర్‌కు మొట్టమొదటి విదేశీ పెట్టుబడులు రానున్నాయి. కశ్మీర్ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ సిద్ధంగా ఉన్నది. కశ్మీర్ లోయలో ఐటీ టవర్‌తోపాటు లాజిస్టిక్ పార్క్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కశ్మీర్ అధికారులతో దుబాయ్ ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నది. ఈ చర్య పాకిస్తాన్‌కు దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ రాయబారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాల్లో భాగంగా, కశ్మీర్లో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్ నిర్ణయించుకున్నది. మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి జమ్ముకశ్మీర్ అధికారులు- దుబాయ్ మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం, ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ టవర్‌తో పాటు మెడికల్ కాలేజీ, దవాఖానను దుబాయ్ నిర్మించనున్నది. అయితే, ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కశ్మీర్ అభివృద్ధికి ప్రపంచం తమతోపాటు వస్తుండటం శుభసూచకమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నదని ఈ ఒప్పందం చూపిస్తుందన్నారు.
దౌత్యపరమైన ఓటమి : బాసిత్
కశ్మీర్ సమస్యపై ముస్లిం దేశాల మద్దతును ఇంతవరకు పాకిస్తాన్ పొందలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) కశ్మీర్ సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దుబాయ్ తీసుకున్న ఒక నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ తగులుతున్నది. జమ్ముకశ్మీర్ అధికారులు-దుబాయ్ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ..పాకిస్తాన్‌కు దౌత్యపరమైన ఓటమిగా పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం భారతదేశానికి పెద్ద విజయం. ఇప్పటికే ఓఐసీ కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

