Accident | ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. మహాకుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో (devotees) వెళ్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు పయనమయ్యారు. పికప్ వాహనంలో వారంతా సొంతూరికి బయల్దేరారు. వారణాసి – ఘాజీపూర్ రోడ్డులోని నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఉస్మి కలా మలుపు వద్దకు రాగానే వీరి వాహనాన్ని ఓ ట్రక్కు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన సమయంలో 20 మంది భక్తులు వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Nirmala Sitharaman | వరుసగా ఎనిమిదోసారి.. రికార్డు బ్రేక్ చేయనున్న నిర్మలమ్మ
Infiltration | దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులు.. మట్టుబెట్టిన సైన్యం
Female Doctor Case | వైద్యురాలిపై సామూహిక అత్యాచారం కేసులో తమిళనాడు కోర్టు సంచలన తీర్పు..!