శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అక్రమచొరబాటుకు (Infiltration) యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వద్ద ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. గుర్తించిన భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు యత్నించగా, ఇరుపక్షాల మధ్య భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఎల్ఓసీ వద్ద రాత్రంతా కాల్పులు జరిగాయని, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని తెలిపింది.
గత నెలలో కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. డిసెంబర్ 18న కుల్గామ్ జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు చనిపోయారు.
Terrorist movement was detected last night at the #LineofControl in #Poonch sector. Alert troops swiftly engaged the infiltrating #terrorists, triggering an intense & heavy firefight. The #operation continued through the night, leading to the neutralization of two terrorists .…
— White Knight Corps (@Whiteknight_IA) January 31, 2025