Nirmala Sitharaman | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు (Make History). ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2025-26)కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను రేపు నిర్మలమ్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. తద్వారా వరుసగా ఎనిమిదిసార్లు (8th Consecutive Budget) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు.
నిర్మలమ్మ ఇప్పటికే ఒక తాత్కాలిక బడ్జెట్, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన విషయం తెలిసిందే. రేపు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పించే బడ్జెట్ ఎనిమిదవది. ఈ బడ్జెట్‌తో వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు సృష్టించనున్నారు. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల రికార్డుకు నిర్మలమ్మ చేరువకానున్నారు.
మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 6 బడ్జెట్లు, 1967-69 మధ్య 4 బడ్జెట్లు సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లను సమర్పించారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకాదు మోదీ హయాంలో అత్యధిక బడ్జెట్లను సమర్పించిన మంత్రిగా కూడా నిలవనున్నారు.
2019లో నరేంద్రమోదీ సారధ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఇప్పుడు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పనున్నారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Economic Survey | మరికాసేపట్లో ఉభయసభల ముందుకు ఆర్థిక సర్వే
Budget session | కుంభమేళా తొక్కిసలాట బాధితులకు పార్లమెంట్ సంతాపం