Budget session | ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session) ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శంగా నిలుస్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ మూడో టర్మ్‌లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు.
‘బడ్జెట్-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం. పేద, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్లమందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దేశంలో లక్షా 15 వేల మంది మహిళలు లక్పతీ దీదీలుగా మారారు. మూడు లక్షలమంది మహిళలను లక్పతీ దీదీగా మార్చాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం’ అని రాష్ట్రపతిముర్ము తన ప్రసంగంలో వివరించారు.
Also Read..
Economic Survey | మరికాసేపట్లో ఉభయసభల ముందుకు ఆర్థిక సర్వే
Budget session | కుంభమేళా తొక్కిసలాట బాధితులకు పార్లమెంట్ సంతాపం
Budget session | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం