Budget session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవలే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన మృతులకు సభ సంతాపం తెలిపింది. అంతేకాకుండా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 40 మంది వరకూ గాయపడినట్లు వెల్లడించింది. ఇక, భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) గతేడాది డిసెంబర్ 26న కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Also Read..
Budget session | పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
PM Modi | దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుంది : ప్రధాని మోదీ
Maha Kumbh Mela | త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు