Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులకు పేలుళ్లకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు రహదారిలో ఐఈడీ పేలుళ్లకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఐఈడీ పేలిన సమయంలో పోలీసుల వాహనంలో 15 మంది డీఆర్జీ జవాన్లు ఉన్నారు. 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కూంబింగ్ తర్వాత తిరిగి వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనను బస్తర్ రీజియన్ ఐజీ ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు
HMPV | భారత్లో పెరుగుతున్న హెచ్ఎమ్పీవీ కేసులు.. అహ్మదాబాద్లో మరో చిన్నారికి వైరస్ పాజిటివ్
Journalist Murder Case: బస్తర్లో జర్నలిస్టు మర్డర్.. హైదరాబాద్లో నిందితుడి అరెస్టు