MLC Kavitha | ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు
MLC Kavitha | జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు.
MLC Kavitha | ఆదిలాబాద్ : జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఆసిఫాబాద్‌లోని దేవునిగూడ గ్రామంలోని ఆదివాసీ గోండు అక్కాచెల్లెళ్ళతో ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు చూపించిన ఆప్యాయతకు, అభిమానానికి కవిత హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజల తరఫున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నదని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించి రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని కవిత విమర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ @RaoKavitha. pic.twitter.com/ChKpaIooIE
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) January 6, 2025
ఇవి కూడా చదవండి..
Wanaparthi | వరంగల్ డిక్లరేషన్ హామీ పత్రాలను భోగి మంటల్లో కాల్చిన రైతులు
KTR | కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

