వనపర్తి : రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో మహిళా కూలీలు నాట్లు వేస్తున్న నిరసన వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయాం. మహిళకు రూ.2,500 ఇస్తామంటే గంప గుత్తగా ఓట్లు వేశాం. కానీ కేసీఆర్ హయాంలో వచ్చే రైతు బంధును బొందపెట్టి మానోట్లో మట్టి కొట్టారు’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి ₹15,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పెద్దగూడెం చౌరస్తాలో రైతులు వరంగల్ డిక్లరేషన్(Warangal Declaration) సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లాలో నాట్లు వేసి నిరసన తెలుపుతున్న కూలీలు..
వరంగల్ డిక్లరేషన్ పేపర్స్‌ను తగలబెడుతున్న రైతులు..