రామగిరి, మార్చి 13: నేటి సమాజంలో ఇంగ్లీష్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో పట్టు సాధించాల్సిన అవసరం తప్పనిసరి అని, వీటిలో రాణిస్తే పోటీ పరీక్షలతో పాటు విద్యా సంస్థల్లో బోదన, పలు రంగాల్లో రాణించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని నల్లగొండలోని గోకుల్ బీఈడీ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్ బొల్లోజు యాదాచారి అన్నారు. నల్లగొండలోని డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్- ఎంఈడీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ‘కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్’ పై శుక్రవారం నిర్వహించిన శిక్షణ, లెక్చర్‌కు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదే విధంగా ఆ సబ్జెక్టులోని అంశాలపై ప్రాక్టీస్, గ్రూప్ డిస్కషన్, స్పీకింగ్ స్కిల్‌పై పలు అంశాలతో ప్రాక్టిస్ చేయించారు. ఈ కార్యక్రమంలో డీవీఎం విద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.గంగాధర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నయ్య, విద్యా సంస్థల సూపరింటెండెంట్ చొల్లేటి శ్రీధరాచారి, బీఈడీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ బొళ్ల నారాయణరెడ్డి, సీనియర్ అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ పాల్గొన్నారు.

కమ్యూనికేషన్ స్కిల్స్‌లో పట్టు అనివార్యం : ప్రిన్సిపాల్ బొల్లోజు యాదాచారి