KTR | హైదరాబాద్ : గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిఫ్ నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది..? ఇది రేవంత్ రెడ్డి టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 41 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గ్రీన్కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు తెలిపింది. 2022లో ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 8న 20 బాండ్లు, అక్టోబర్ 10న 6 బాండ్లు కొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీస్ ప్రధాన గేటు వద్దే కేటీఆర్ కారును అడ్డుకున్నారు. దీంతో సుమారు 45 నిమిషాలపాటు అక్కడే వేచి ఉన్నారు. తనను అడ్వకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టారు. పోలీసులు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండా అక్కడి నుంచి వెనుతిరిగారు. అయితే ఈ క్రమంలో తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందించారు.
ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. అలాగే ‘తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించి తన నుంచి సమాచారంతోపాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరింది. అయితే అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదు. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని అందులో కోరారు. అదేవిధంగా రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహరిస్తానని తెలిపారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వులో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అవకాశం పరిశీలించాలని’ ఏసీబీ డీఎస్పీ మజిద్ ఖాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavita | కేటీఆర్‌పై అందుకే అక్రమ కేసులు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Rythu bharosa | రైతు భరోసా మోసంపై కర్షకుల కన్నెర్ర.. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిరసనలు
Advocate Rama Bharat | తప్పుడు ఉద్దేశం లేకుంటే న్యాయవాదిని ఎందుకు రానివ్వలేదు?: అడ్వకేట్ సోమ భరత్