HMPV | భారత్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో కేసు బయటపడింది.
రెండేళ్ల చిన్నారికి HMPV వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చిన్నారి అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి రాజస్థాన్‌లోని దుంగార్పూర్గా తెలిసింది. తాజా కేసుతో భారత్‌లో మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
అంతకుముందు బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు వైరస్ సోకినట్లు తేలిన విషయం తెలిసిందే. మూడు కేసుల్లో వైరస్ సోకిన పిల్లల కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదు. అయినప్పటికీ వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
HMPV | భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్.. హెచ్‌ఎమ్‌పీవీ లక్షణాలు ఇవే..!
“HMPV | బెంగళూరులో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. ధృవీకరించిన ICMR”
“HMPV | చైనాలో మరో మహమ్మారి.. మృతులతో నిండిపోతున్న శ్మశానాలు ?”
“HMPV | హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. అప్రమత్తమైన భారత్”
“HMPV Virus | చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి.. అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ”