శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 18:30:46

కరోనా వ్యాక్సిన్: ల‌క్ష‌ల డోసులు త‌యారీ మా ల‌క్ష్యం

కరోనా వ్యాక్సిన్: ల‌క్ష‌ల డోసులు త‌యారీ మా ల‌క్ష్యం

హైదరాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సిన్ త‌యారీ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతున్న‌ద‌ని ప్రపంచంలోనే అతిపెద్ద టీకా త‌యారీ సంస్థ అయిన సీర్‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. వ‌చ్చే మూడు నెలల్లో కొన్ని ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని తాము ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నామ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా చెప్పారు. ఇప్ప‌టికే ఇత‌ర వ్యాధుల‌కు సంబంధించి 1.50 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ త‌యారుచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విక్ర‌యించ‌డం ద్వారా సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ అతిపెద్ద వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌గా గుర్తింపు పొందిన‌ది. 

బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికాతో క‌లిసి ఇది క‌రోనా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంద‌ని పూనావాలా తెలిపారు. అందుకు సంబంధించి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తి కూడా పొందింద‌ని చెప్పారు. అన్ని ట్ర‌య‌ల్స్ పూర్తిచేసుకుని లైసెన్స్ పొందిన త‌ర్వాత ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, అయితే ఆ వ్యాక్సిన్ ప్ర‌పంచ‌లో ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులోకి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని పూనావాలా అభిప్రాయ‌ప‌డ్డారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo