సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 23:20:11

వ్యాక్సిన్ మేకర్లూ.. తస్మాత్ జాగ్రత్త..! సైడ్ ఎఫెక్ట్ సవాళ్లున్నాయ్!!

వ్యాక్సిన్ మేకర్లూ.. తస్మాత్ జాగ్రత్త..! సైడ్ ఎఫెక్ట్ సవాళ్లున్నాయ్!!

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ దుష్ప్రభావంతో గానీ, ఇతర సమస్యలతో గానీ ఇబ్బందుల పాలయ్యే బాధితులకు పరిహారం చెల్లించడానికి దాని తయారీ దారులు సిద్ధంగా ఉండాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈవో) అడార్‌ పూనంవాలా కోరారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి రూపొందించిన టీకాను వ్యాక్సినేషన్‌ చేయడం వల్ల ఇబ్బందుల పాలయ్యే బాధితులు కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని శుక్రవారం కార్నేజ్‌ ఇండియా గ్లోబల్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.  

సీరం ఇన్‌స్టిట్యూట్‌తోపాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ కలిసి కొవిషీల్డ్‌ అనే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ తొలి దశ ట్రయల్‌లో పాల్గొన్న 40 ఏండ్ల వ్యక్తి 11 రోజుల తర్వాత తీవ్రమైన న్యూరాలజికల్‌ సమస్యను ఎదుర్కొన్నారు. దీనికి సదరు వ్యక్తి రూ.5 కోట్ల పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆడార్‌ పూనంవాలా వ్యాఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఆరోపణలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ తిరస్కరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo