అడుగడుగునా నీరాజనం
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కేసీఆర్ బస్సు యాత్ర రాందాస్ చౌరస్తాకు చేరుకోగానే బాణాసంచా కాలుస్తూ.. కేసీఆర్ వాహనంపై పూలవర్షం కురిపించారు.
మెదక్ మున్సిపాలిటీ, మే 7: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కేసీఆర్ బస్సు యాత్ర రాందాస్ చౌరస్తాకు చేరుకోగానే బాణాసంచా కాలుస్తూ.. కేసీఆర్ వాహనంపై పూలవర్షం కురిపించారు. సాయంత్రం ఈదులుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసినా కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన ప్రజానీకంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఆశేష జనవాహిని తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. బస్సు యాత్ర వెంట బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చారు. గులాబీ జెండాలు, ఫ్లకార్డులు పట్టుకొని జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ వాహనం రాందాస్ చౌరస్తాకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న వేలాదిమంది ప్రజలు, అభిమానులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. రోడ్డు షోలో పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

