Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టులకు (High Courts) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మూడు రాష్ట్రాల్లోని కోర్టులకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
కేరళ హైకోర్టు (Kerala High Court), గౌహతి హైకోర్టు (అస్సాం), బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ (Aurangabad bench of Bombay HC)కు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయా కోర్టులకు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయా కోర్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో హైకోర్టుల ప్రాంగణాలను తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Jammu and Kashmir | జమ్ముకశ్మీర్‌లో టూరిస్ట్‌లపై ఉగ్రవాదుల కాల్పులు.. ఆరుగురికి గాయాలు
PM Modi | ప్రత్యేక స్వాగతం.. ప్రధాని మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా సౌదీ ఫైటర్ జెట్లు.. VIDEO
Nitin Gadkari | వాహనాలకు హారన్లుగా భారతీయ సంగీత పరికరాల శబ్దాలు : కేంద్ర మంత్రి గడ్కరీ