శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 16:07:31

డీసెంట్‌గా షాపులోకి ఎంట్రీ ఇచ్చి.. స్నాక్స్ ప్యాకెట్‌ను భ‌లే నొక్కేసింది!

డీసెంట్‌గా షాపులోకి ఎంట్రీ ఇచ్చి.. స్నాక్స్ ప్యాకెట్‌ను భ‌లే నొక్కేసింది!

కొంత‌మంది స‌రుకులు కోసం సూప‌ర్‌మార్కెట్‌, మాల్స్‌ల‌కు వెళ్తుంటారు. కొంద‌రు నిజాయితీగా కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. కొంత‌మంది ఉంటారు. వంక‌ర‌బుద్ది ఎక్క‌డికి పోద్ది, ఎవ‌రికి తెలియ‌కుండా వ‌స్తువుల‌ను లోప‌ల దాచుకొని బ‌య‌ట‌కు చెక్కేద్దాం అనుకుంటారు. తీరా అక్క‌డ ఉండే సీసీకెమెరాలో అంతా రికార్డు అయి వీరి బండారం బ‌య‌ట పె‌డుతుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌నుషుల‌కే కాదు ప‌క్షుల‌కు కూడా ఎదుర‌వుతుంటాయి.

8 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో ఒక ప‌క్షి చాలా డీసెంట్‌లో షాపులోకి ఎంట్రీ ఇస్తుంది. త‌ర్వాత దానికి అక్క‌డ స్నాక్స్ ప్యాకెట్స్ కంట ప‌డుతాయి. ఇంకేముంది నోటితో ఒక ప్యాకెట్‌ను ప‌ట్టుకొని అక్క‌డ నుంచి తుర్రుమంది. ఇదంతా అక్క‌డున్ సీసీకెమెరాలో రికార్డైంది. ఇప్పుడిది నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 


logo