కైలాస దేశంలోకి భారతీయుల రాకపై నిత్యానంద నిషేధం

న్యూఢిల్లీ: వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తన దేశంగా ప్రకటించుకున్న కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం విధించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్రెజిల్, ఐరోపా యూనియన్, మలేషియాతోపాటు భారత్ నుంచి భక్తులు, పర్యాటకుల రాకపై తదుపరి ఆదేశాల వరకు నిషేధం విధించినట్లు తెలిపారు. కైలాస రాష్ట్రపతి ఆదేశం పేరుతో ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు.
KAILASA's #PresidentialMandate
— KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) April 20, 2021
Executive order directly from the #SPH for all the embassies of #KAILASA across the globe. #COVID19 #COVIDSecondWaveInIndia #CoronaSecondWave #Nithyananda #Kailaasa #ExecutiveOrder pic.twitter.com/I2D0ZvffnO
కర్ణాటకలో ఆశ్రమం నిర్వహించే నిత్యానందపై మహిళా భక్తుల నుంచి లైంగిక దాడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశం నుంచి పారిపోయిన ఆయన 2019 నుంచి ఈక్వెడార్ తీరంలో ఉన్న ద్వీపంలో దాగి ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికి కైలాస దేశంగా పేరుపెట్టడంతోపాటు ప్రత్యేక చట్టాలను రూపొందించారు. కైలాసను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కూడా విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

