priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
priest predicted son, shot dead | ఒక దంపతులకు కుమారుడు జన్మిస్తాడని ఆలయ పూజారి జోస్యం చెప్పారు. అయితే కూతురు పుట్టడంతో తండ్రీ, కొడుకులు ఆ పూజారిని కాల్చి చంపారు. నేరాన్ని మరో వ్యక్తిపైకి నెట్టేందుకు అతడి ఫొటోను అక్కడ వదిలి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
లక్నో: ఒక దంపతులకు కుమారుడు జన్మిస్తాడని ఆలయ పూజారి జోస్యం చెప్పారు. అయితే కూతురు పుట్టడంతో తండ్రీ, కొడుకులు ఆ పూజారిని కాల్చి చంపారు. నేరాన్ని మరో వ్యక్తిపైకి నెట్టేందుకు అతడి ఫొటోను అక్కడ వదిలి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (priest predicted son, shot dead) ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న రాత్రివేళ ఇద్దరు వ్యక్తులు బైక్పై శివాలయానికి చేరుకున్నారు. 81 ఏళ్ల పూజారి అయిన స్వామి దేవానంద భారతిపై కాల్పులు జరిపి హత్య చేశారు. గ్రామానికి చెందిన హరేంద్ర అనే వ్యక్తి ఫొటోను అక్కడ వదిలేసి వారు పారిపోయారు.
కాగా, పూజారి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఆలయానికి చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. సంఘటనా స్థలంలో లభించిన హరేంద్ర ఫొటోను స్వాధీనం చేసుకున్నారు. పూజారి హత్యపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఆ గ్రామానికి చెందిన హాషిమ్, ఆయన కుమారుడు జీషాన్ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. నేరానికి వినియోగించిన బైక్, రెండు నాటు తుపాకులు, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు జీషాన్ భార్య గర్భవతి కావడంతో ఆ దంపతులకు కొడుకు పుడతాడని శివాలయం పూజారి స్వామి దేవానంద భారతి జోస్యం చెప్పినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అయితే నెలన్నర కిందట ఆడ పిల్ల పుట్టడంతో తండ్రీకొడుకులైన హాషిమ్, జీషాన్కు ఆ పూజారి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపి ఆయనను హత్య చేశారని వివరించారు.
అలాగే గ్రామానికి చెందిన హరేంద్ర అనే వ్యక్తితో కూడా వారికి వివాదం ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో పూజారి హత్య కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో నేర స్థలంలో అతడి ఫొటో వదిలి వెళ్లినట్లు చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

