Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Prabhas | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
Prabhas | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. గత పదిహేను రోజులుగా హైదరాబాద్‌లోని కోకాపేటలో వేసిన భారీ ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది.
అయితే, సెట్లో షూటింగ్ బిజీలో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి కాలికి స్వల్ప గాయం కావడంతో, చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చింది. ఇది పెద్ద గాయం ఏమీ కాకపోవడంతో, సోమవారం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రెగ్యులర్ షూటింగ్ యథావిధిగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం కోకాపేటలోని భారీ టెంపుల్ సెట్ మరియు కోనేరు నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
చారిత్రాత్మక నేపథ్యంలో, ముఖ్యంగా అజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

