ఈ యాప్‌లు మీ మొబైల్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి
మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారా? కొత్త కొత్త యాప్‌లు ట్రై చేయడం మీకు అలవాటా? అయితే జాగ్రత్త !! ఈ 8 యాప్‌లు మీ మొబైల్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారా? కొత్త కొత్త యాప్‌లు ట్రై చేయడం మీకు అలవాటా? అయితే జాగ్రత్త !! ఈ 8 యాప్‌లు మీ మొబైల్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. కొత్తరకం మాల్ వేర్ కలిగి ఉన్న 8 యాప్‌ల జాబితాను తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది. ఫొటో ఎడిటర్, వాల్ పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్ అలాగే కెమెరా యాప్‌ల పేరుతో ఇవి యూజర్లను ఆకర్షిస్తున్నాయని మెకాఫీ సంస్థ తన రిపోర్ట్‌లో తెలిపింది. ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిసులా ప్రాంతానికి చెందిన యూజర్లే ఈ యాప్‌ల ప్రధాన టార్గెట్‌గా గుర్తించింది. ఈ యాప్‌లకు ఇప్పటికే 7 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొంది. ఈ 8 యాప్‌లు మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.
ఒక యాప్‌ను గూగుల్ పరిశీలించి, ఎలాంటి హానికర మాల్వేర్స్ లేవని నిర్ధరణకు వచ్చి అప్రూవల్ ఇస్తేనే అది గూగుల్ ప్లే స్టోర్‌లోకి వస్తుంది. అయితే ఈ 8 యాప్‌లు రివ్యూ సమయంలో క్లీన్ వర్షన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌కు సమర్పించి, అప్రూవల్ తర్వాత అప్డేట్స్ ద్వారా మాల్వేర్ను ప్రవేశపెట్టినట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో తేలింది. వెంటనే ఈ 8 యాప్‌లను అన్ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది.
మాల్వేర్ ఉన్న 8 యాప్‌లు ఇవే..
com.studio.keypaper2021
com.pip.editor.camera
org.my.favourites.up.keypaper
com.super,color.hairdryer
com.celab3.app.photo.editor
com.hit.camera.pip
com.daynight.keyboard.wallpaper
com.super.star.ringtones
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లు ఉండొచ్చో తెలుసా
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
పింక్ కలర్లో వాట్సాప్.. నమ్మి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు
సక్సెస్.. మార్స్‌పై ఎగిరిన నాసా హెలికాప్టర్
వాట్సాప్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- android
- apps
- smartphones
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

