మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లు ఉండొచ్చో తెలుసా
మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి? మీ అడ్రస్ ప్రూఫ్ మీద ఎవరైనా దొంగ సిమ్ తీసుకున్నారా? వాటితో ఎవరైనా మిస్ యూజ్ చేస్తున్నారా? ఇంతకుముందు ఈ వివరాలు తెలిసేవి కాదు !! దీంతో ఎవరో మిస్ యూజ్ చేస్తే మనం చిక్కుల్లో పడేవాళ్లం !! ఇకపై అలా ఇబ్బందుల్లో పడకుండా మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ టెలికాం విభాగం వీలు కల్పించింది. అంతేకాకుండా మనం ఉపయోగించని నంబర్లపై రిపోర్టు చేసే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. అలా రిపోర్టు చేసిన నంబర్లపై చర్యలు తీసుకుంటామని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ఏపీ, తెలంగాణ టెలికం సర్కిల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఒక్క వ్యక్తిపై గరిష్ఠంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుందని ఆయన తెలిపారు.
ఎలా తెలుసుకోవాలి?
- ముందుగా http://tafcop.dgtelecom.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- ఆ వెబ్సైట్లో మన ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే, ఓటీపీ వస్తుంది.
- మన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని వెబ్సైట్లో ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలు వస్తాయి.
- ప్రతి నంబర్ దగ్గర రిపోర్ట్ చేయడానికి ఇది నా నంబర్ కాదు, నా నంబరే కానీ ఉపయోగించడం లేదు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
- వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఆ నంబర్లపై టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్ పరిస్థితులు తేవొద్దు.. అది చివరి అస్త్రంగా వాడాలి
పింక్ కలర్లో వాట్సాప్.. నమ్మి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు
సక్సెస్.. మార్స్‌పై ఎగిరిన నాసా హెలికాప్టర్
వాట్సాప్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Phone tapping
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

