లాక్డౌన్ పరిస్థితులు తేవొద్దు.. అది చివరి అస్త్రంగా వాడాలి
Lock down | రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే భావించాలి.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.

న్యూఢిల్లీ: కరోనా రెండ్ వేవ్ ( corona second wave ) దేశ ప్రజలపై విరుచుకు పడుతున్నది. ఈ దశలో జాతికి ధైర్యం చెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడుతూ కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే భావించాలని అన్నారు. లాక్డౌన్ ( Lock down ) నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను మోదీ కోరారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే..
కరోనాను కట్టడి చేయడానికి కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నాం.. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతున్నది.. రెండో దశలో తుపాన్ వలే విరుచుకు పడుతున్నది. కరోనాను నియంత్రించడానికి అహర్నిశలు క్రుషి చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నా..
ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలం.. ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో పరిస్థితులను చక్కదిద్దుతాయి.. సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి క్రుషి చేస్తున్నాం..
ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మనదేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయి.. ఫ్రంట్ లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్లకు టీకాల ప్రక్రియ పూర్తి చేశాం.
మే ఒకటో తేదీ తర్వాత కూడా 45 ఏండ్లు దాటిన వారికి టీకాల ప్రక్రియ కొనసాగుతుంది. 18 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేస్తే దేశంలోని వివిధ నగరాల్లో సత్ఫలితాలు వస్తాయి. యువకులు టీమ్‌లుగా ఏర్పడి ప్రజలకు అవగాహన కలిగించాలి..
ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం.. కొత్త వ్యాక్సిన్లకు ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో అనుమతులు ఇచ్చాం.
12 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు తీసుకున్నాం.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దు. లాక్ డౌన్ విధించే పరిస్థితి తీసుకు రావొద్దు.. కరోనాను నియంత్రించడానికి రాష్ట్రాలు సహకరిస్తున్నాయి.
కరోనా రోగులకు చికిత్స చేసేందుకు కొవిడ్ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నాం.. కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే భావించాలి.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్‌బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

