Raksha Bandhan | నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan). ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల (School students)తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వారితో రాఖీ కట్టించుకొని సరదాగా టైమ్ స్పెండ్ చేశారు.
ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. మోదీ తన తల్లి వద్ద కూర్చొని ఉన్న ఫొటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ఓ చిన్నారి ప్రధానికి కట్టింది. దీన్ని చూసిన ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Delhi | School students tie ‘Rakhi’ to PM Narendra Modi, on the festival of ‘Raksha Bandhan’
(Source: DD) pic.twitter.com/yqUQq3DLuv
— ANI (@ANI) August 19, 2024
అంతకు ముందు రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా – తమ్ముళ్లు, అన్నా – చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రజల జీవితాల్లో ఆప్యాయతలను, సామరస్య భావాలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Also Read..
Raksha Bandhan | బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు రాఖీ కట్టిన కోల్‌కతా వైద్యులు
KTR post | నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా.. సోదరి కవితను ఉద్దేశించి ఆవేదనతో కేటీఆర్ పోస్ట్
India Day Parade | న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్.. ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం నమూనా