KTR post : రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు కూడా రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR).. జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavita) ను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆవేదనతో కూడిన పోస్ట్ చేశారు.
తన సోదరి కవిత ఈ రోజు తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, కానీ ఆమెకు ఏ కష్టమొచ్చినా తాను ఎళ్లవేలలా అండగా ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీకు కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు లవ్ సింబల్‌ను జతచేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను షేర్ చేశారు.
You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc
— KTR (@KTRBRS) August 19, 2024