Raksha Bandhan | నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సోదర సోదరీమణులు రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షణ కల్పించాలని కోరుతూ ఆడబిడ్డలు తమ సోదరులకు రాఖీలు కడుతున్నారు. నోరు తీపి చేసి అన్నీ శుభాలే కలగాలని, వారి బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా సోదరి రక్షా బంధనం కట్టి సోదరుడి నుంచి ఆశీస్సులు తీసుకుంటున్నారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ గవర్నర్ (Bengal Governor) సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose)కు పలువురు మహిళా నాయకులు, వైద్యులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు. ఇక్కడ ప్రజా స్వామ్యం క్షీణిస్తోంది. ఈరోజు మనం మన కుమార్తెలు, సోదరీమణులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. స్త్రీలు సురక్షితంగా, సంతృప్తిగా భావించే సమాజం నిర్మించడంలో మనం విఫలమయ్యాం’ అని పేర్కొన్నారు.
Also Read..
Students | స్కూల్లో బిస్కెట్లు తిని.. ఆసుపత్రిపాలైన 150 మంది విద్యార్థులు
Abhishek Manu Singhvi | రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మనుసింఘ్వీ.. Video
KTR | తెలంగాణ భవన్లో రాఖీ సంబురాలు.. కేటీఆర్కు రాఖీ కట్టిన మహిళా నేతలు.. వీడియో