భువనేశ్వర్: ఒక ఉపాధ్యాయుడు (Sanskrit Teacher) క్లాస్‌లోని ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థినులు స్కూల్ హెడ్మాస్టార్కు ఫిర్యాదు చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్ పారిపోయాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ స్కూల్లో సంస్కృతం బోధించే ఉపాధ్యాయుడు ఏడుగురు మైనర్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. అతడి ఆగడాలు భరించలేని ఆ బాలికలు స్కూల్ హెడ్మాస్టార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ హెడ్మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బాధిత బాలికలు తనపై ఫిర్యాదు చేసినట్లు ఆ ఉపాధ్యాయుడు తెలుసుకున్నాడు. దీంతో ఒక వ్యక్తితో స్కూల్‌కు సెలవు లేఖ పంపాడు. అనంతరం అతడు పారిపోయాడు. అయితే ఆ ఉపాధ్యాయుడిపై గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. స్కూల్ అధికారులు ఆయనను హెచ్చరించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.
మరోవైపు హెడ్మాస్టర్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఆ టీచర్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధిత బాలికల స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.
Also Read:
US cops shoot dead Sikh man | సిక్కు వ్యక్తి కత్తితో విన్యాసాలు.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు