ముంబై: తనపై కాల్పులు జరిపినప్పటికీ వెనక్కి తగ్గబోనని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange Patil) స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం వేలాది మందితో కలిసి ముంబైలోని ఆజాద్ మైదాన్‌కు చేరుకున్న ఆయన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. మరాఠా కోటా రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న 43 ఏళ్ల మనోజ్ జరంగే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నేను పక్కా ప్రణాళికతో ఇక్కడికి వచ్చాను. నా నిరాహార దీక్ష ప్రారంభమైంది. మా డిమాండ్లు నెరవేరే వరకు నేను ఇక్కడి నుంచి లేవను. బుల్లెట్లు కూడా నన్ను వెనక్కి లాగలేవు. విజయం సాధించి, ఆ వేడుకలో మా తలలపై గులాల్ పడకపోతే, ఆజాద్ మైదాన్ నుంచి మేం కదలబోం’ అని అన్నారు.
కాగా, ఆందోళన సమయంలో క్రమశిక్షణతో ఉండాలని, శాంతిని కాపాడాలని అనుచరులు, నిరసనకారులకు మనోజ్ పిలుపునిచ్చారు. ‘హింస, విధ్వంసం, రాళ్ల దాడి వంటివి చేయకూడదు. పోలీసులకు సహకరించండి. ఎవరూ మద్యం తాగకూడదు. ఎవరూ ఇబ్బంది కలిగించకూడదు. మన సమాజం సిగ్గుతో తల వంచుకునేలా ఏ పని చేయకండి’ అని జనసమూహానికి సూచించారు.
మరోవైపు వర్షాల నేపథ్యంలో ముంబై నగర వాసులకు ఇబ్బంది కలిగించవద్దని మనోజ్ కోరారు. ముంబైకి తరలివచ్చిన వేలాది మందిలో సగం నవీ ముంబైలోని వాషి ప్రాంతానికి వెళ్లి అక్కడ నిరసన కొనసాగించాలని అన్నారు. ఆందోళన అహింసాత్మకంగా ఉండాలని నొక్కి చెప్పారు.
Mumbai, Maharashtra: Maratha activist Manoj Jarange Patil says, “We must stay united and give our full strength. We had planned to hold the strike at Azad Maidan and we have reached here. Earlier, the government was not listening to us and not providing help, so we decided to… pic.twitter.com/0GczZpza3Q
— IANS (@ians_india) August 29, 2025
VIDEO | Maratha quota protest: Maratha activist Manoj Jarange’s supporters gather near Chhatrapati Shivaji Terminus in Mumbai.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/lw9niWY30L
— Press Trust of India (@PTI_News) August 29, 2025
Also Read:
Watch: స్కూటర్ రివర్స్ చేస్తుండగా ఓపెన్ డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. తర్వాత ఏం జరిగిందంటే?