భోపాల్: ఒక విద్యార్థిని మరో ఇద్దరితో కలిసి హోటల్ రూమ్స్‌లో స్పై కెమెరా అమర్చింది. (Spy Camera Racket Busted) సన్నిహిత వీడియోలతో జంటలను బ్లాక్మెయిల్ చేశారు. వారిని డబ్బులు డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. రాధా చౌబే ఇంజినీరింగ్ చదువుతున్నది. ఆర్థిక సమస్యలు, ఎంబీఏ చదివేందుకు అవసరమైన డబ్బు కోసం వక్రదారి పట్టింది. స్నేహితుడు భూపేంద్ర ధకాడ్, అతడి సహచరుడు బ్రిజేష్ ధకాడ్తో కలిసి ఒక ముఠాగా ఏర్పడింది.
కాగా, గ్వాలియర్‌లోని హోటల్ విరాట్ ఇన్‌లో రాధా రూమ్స్ బుక్ చేసేది. భూపేంద్ర, బ్రిజేష్ కలిసి ఆ రూమ్స్‌లోని బల్బు హోల్డర్‌లో స్పై కెమెరా అమర్చేవారు. కొన్ని రోజుల తర్వాత స్పై కెమెరా తొలగించేవారు. అందులో రికార్డైన జంటల సన్నిహిత వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీని కోసం తన స్నేహితురాలిని రాధా ట్రాప్ చేసింది. ఆమె, అతడి బాయ్ ఫ్రెండ్ కోసం రూమ్ బుక్ చేసింది. స్పై కెమెరా ద్వారా వారి సన్నిహిత వీడియోను రికార్డ్ చేశారు. ఆ తర్వాత స్నేహితురాలి ప్రియుడ్ని లక్ష డిమాండ్ చేశారు.
మరోవైపు 27 ఏళ్ల పుష్పేంద్ర ప్రజాపతి జూలై 26న తన స్నేహితురాలితో కలిసి హోటల్ విరాట్ ఇన్‌లో బస చేశాడు. ఆ తర్వాత లక్ష చెల్లించకపోతే ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామని బెదిరిస్తూ అతడి వాట్సాప్‌కు మెసేజ్‌లు వచ్చాయి. భయపడిన పుష్పేంద్ర తొలుత రూ.5,000, ఆ తర్వాత రూ. 45,000 వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. అయితే ఆ ముఠా మరో రూ.50,000 డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కాగా, బ్లాక్మెయిల్ నంబర్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థిని రాధా వ్యవహారం బయటపడింది. ఈ రాకెట్లో సూత్రధారి అయిన ఆమెతోపాటు భూపేంద్ర, బ్రిజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మొబైల్స్, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, పెన్ డ్రైవ్‌లలో చాలా జంటల సన్నిహిత వీడియోలు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మరి కొన్ని జంటలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే హోటల్ రిసెప్షన్ నుంచి కాంటాక్ట్ వివరాలు సేకరించడంలో వారు విఫలమయ్యారని అన్నారు. ఈ వ్యవహారంలో హోటల్ సిబ్బంది వీరికి సహకరించారా? అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Watch: క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?