అహ్మదాబాద్: ఒక వ్యక్తితో చెల్లికి ప్రేమ వ్యవహారం ఉన్న సంగతి ఆమె అన్నకు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన అతడు ఆమెను బెదిరించి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Sister Twice) బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. గుజరాత్లోని భావ్నగర్లో ఈ సంఘటన జరిగింది. వివాహితుడైన 29 ఏళ్ల వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. 22 ఏళ్ల సోదరికి గ్రామానికి చెందిన వ్యక్తితో మూడేళ్లుగా సంబంధం ఉన్నట్లు అతడికి తెలిసింది. దీంతో చెల్లిని అతడు బెదిరించసాగాడు.
కాగా, జూలై 13న ఆ వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సోదరిని అతడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్ట్ 22న భార్య బయటకు వెళ్లినప్పుడు రెండోసారి చెల్లిపై అత్యాచారం చేశాడు. ఈ సందర్భంగా సిగరెట్ కాల్చి ఆమె తొడపై వాతపెట్టాడు.
మరోవైపు బాధిత మహిళ ఆ రాష్ట్ర మహిళా హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. సోదరుడి లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. దీంతో భావ్నగర్ పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అయితే బాధిత మహిళతోపాటు నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. లైంగిక దాడి సందర్భంగా సోదరిని బెదిరించిన కత్తితో పాటు అతడి దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
US cops shoot dead Sikh man | సిక్కు వ్యక్తి కత్తితో విన్యాసాలు.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు