Mulayam Singh Yadav | మహా కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు
Mulayam Singh Yadav | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద మహా కుంభమేళా సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కుంభమేళాలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Mulayam Singh Yadav | లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద మహా కుంభమేళా సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కుంభమేళాలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ములాయం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సాధువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ సెక్టార్ 16లోని శిబిరంలో ఏర్పాటు చేశారు. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో ఉన్న ములాయం విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించినట్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మాతా ప్రసాద్ పాండే ఆదివారం తెలిపారు.
అయితే ములాయం విగ్రహా ఏర్పాటును అఖిల భారతీయ అఖార పరిషత్ తీవ్రంగా విమర్శించారు. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ హిందూ వ్యతిరేకి అని మండిపడ్డారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన పని చేశారని విమర్శలు గుప్పించారు. ములాయం విగ్రహం ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు.. ఆయన యూపీకి సీఎంగా పని చేశారు. కానీ మహా కుంభమేళాలో ములాయం విగ్రహాన్ని ప్రతిష్టించడం సరికాదు. ఈ విగ్రహా ఏర్పాటుతో యూపీలో ఆయన చేసిన అరాచకాలు, అల్లర్లు, మతవిద్వేషాలు గుర్తుకు వచ్చేలా ఉందన్నారు. ఈ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎస్పీ నేతలు. రామమందిర ఉద్యమంలో ఆయన సహకారం ఏమిటో అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ హిందూ వ్యతిరేకి, సనాతన ధర్మానికి వ్యతిరేకి, ముస్లింలకు అనుకూలంగా ఉండేవారు అని రవీంద్ర పూరి పేర్కొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెయిన్‌పురి, అజాంఘర్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2022 అక్టోబర్ 10న ములాయం చనిపోయారు.
ఇవి కూడా చదవండి..
Laurene Powell Jobs | కుంభమేళాకు స్టీవ్‌జాబ్స్ సతీమణి.. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లారెన్
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Maha Kumbh Mela | కుంభమేళాకు తరలివస్తున్న భక్తులు.. త్రివేణి సంగమంలో లక్షలాది మంది పవిత్ర స్నానాలు
Maha Kumbh | 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా..! ఈ ఆరు రోజులు మరీ స్పెషల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

